విడుదలై 50 రోజులు... స్టిల్ నాన్ స్టాప్

Friday,February 10,2017 - 04:57 by Z_CLU

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దంగల్. అదిరిపోయే స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ బరిలో కూడా అదిరిపోయే వసూళ్లు కొల్లగొడుతోంది. ఓ సినిమా పట్టుమని 10రోజులు ఆడడమే కష్టమౌతున్న ఈ రోజుల్లో… దంగల్ మూవీ సక్సెస్ ఫుల్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికీ కలెక్షన్లు కొల్లగొడుతూనే ఉంది.

మల్లయోధుడిగా అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా భారత్ లో అత్యధిక వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన ఏడో వారం కూడా ఈ సినిమాకు కోటి రూపాయల షేర్ వచ్చింది. అంతేకాదు.. ఒక్క ఇండియాలోనే ఈ సినిమా ఇప్పటివరకు 386కోట్ల రూపాయల నెట్ బిజినెస్ చేసింది. ఇండియా కంటే ముందే విదేశాల్లో విడుదలైంది కాబట్టి… ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అమీర్ ఖాన్.. ఇప్పటివరకు తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయలేదు.

dangal-records-zee-cinemalu