1500 కోట్ల మార్క్ ని దాటేసిన దంగల్

Monday,May 22,2017 - 09:55 by Z_CLU

రీసెంట్ గా చైనాలో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దంగల్ ఈ ఆదివారం 1500 కోట్ల మార్క్ ని దాటేసింది. నితేష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘దంగల్’ ఒక్క చైనాలోనే 731.36 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను కూడా ఇంప్రెస్ చేసేసింది. హాలీవుడ్ సినిమాలను పక్కన పెడితే, చైనాలో ఈ రేంజ్ లో వసూలు చేసిన మొట్టమొదటి నాన్ హాలీవుడ్ ఫారిన్ సినిమా ‘దంగల్’.

పక్కా ప్రమోషన్ స్ట్రాటజీ తో చైనా మార్కెట్ లోకి దిగిన దంగల్ సినిమా యూనిట్, ఈ సినిమా ప్రమోషన్స్ లో చైనీస్ సూపర్ స్టార్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం విశేషం. ‘Shuai Jiao Baba’ టైటిల్ తో రిలీజైన దంగల్, చైనాలో రిలీజైన ఫస్ట్ డే నుండే ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడం లో సక్సెస్ అయింది. పాజిటివ్ మౌత్ టాక్ తో పాటు, చైనా మీడియా స్ప్రెడ్ చేసిన జెన్యూన్ రివ్యూస్, సినిమాని సక్సెస్ మోడ్ లో నిలబెట్టాయి. ఇప్పటికీ ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో అంతే స్ట్రెంత్ తో ప్రదర్శించబడటం విశేషం.