ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతున్న దంగల్

Friday,December 23,2016 - 11:20 by Z_CLU

మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ స్టామినా మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఇండియా కంటే 2 రోజుల ముందే విదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్ లో రికార్డు వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్  నుంచి ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు అందిన లెక్కల ప్రకారం.. ఒక్క బుధవారం రోజే అమెరికా నుంచి దంగల్ సినిమా కేవలం తొలిరోజు 3 లక్షల 25వేల డాలర్లు ఆర్జించింది. విదేశాల్లో 4వేల3వందల స్క్రీన్స్ పై దంగల్ సినిమా విడుదలైంది. ఒక్క అమెరికాలోనే ఈ సినిమాను 1000 స్క్రీన్స్ పై ప్రదర్శిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ ఇంత భారీస్థాయిలో ఓవర్సీస్ లో విడుదలవ్వడం ఇదే ఫస్ట్ టైం.

ఇక కాలిఫోర్నియాలోని ఓ థియేటర్ లో ఇప్పటివరకు ఈ సినిమా కోసం వందకు పైగా షోలు వేశారు. కేవలం 48 గంటల్లో ఒకే సినీప్లెక్స్ లో ఇన్ని షోలు వేయడం కూడా ఓ రికార్డే. ఇలా ఇండియాలో విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న దంగల్ సినిమా.. ఈరోజు దేశవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో అమీర్ మల్లయోధుడిగా కనిపిస్తాడు.