మైల్ స్టోన్ గా మారిన దంగల్

Tuesday,January 31,2017 - 01:00 by Z_CLU

డిసెంబర్ 23 న రిలీజయింది. అప్పటి నుండి అమీర్ ఖాన్ దంగల్ ట్రెండింగ్ క్యాటగిరీ నుండి కాస్త కూడా మూవ్ అవ్వడం లేదు. అమీర్ ఖాన్ కరియర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో దంగల్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఇటు ఇండియాలోనూ, అటు ఓవర్ సీస్ లోను ఇంప్రెసివ్ రిమార్క్ తో దూసుకుపోతున్న దంగల్, ఫిలిం లవర్స్ ని మాత్రమే కాదు, ఏకంగా ఫిలిం మేకర్స్ ని కూడా ఇంప్రెస్ చేసేసింది. ఒక్క ఇండియాలోనే 385.06 కోట్లు వసూలు చేసిన దంగల్ ట్రేడ్ వర్గాలను కూడా షాక్ అయ్యేలా చేసింది.

dangal-records-zee-cinemalu

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విమెన్ రెస్ట్ లర్స్ రియల్ స్టోరీని రిఫరెన్స్ గా తీసుకుని తెరకెక్కిన దంగల్, మరెన్నో సినిమాలను ఇన్స్ పిరేషన్ లా నిలబడింది. ఇది జస్ట్ సినిమా సక్సెస్ మాత్రమే కాదు, విమెన్ ఎంపవర్ మెంట్ కోసం ఫైట్ చేసే ప్రతి ఒక్కరి సక్సెస్ గా ఫీల్ అవుతుంది సినిమా యూనిట్.