దంగల్ వసూళ్లు... 1948 కోట్లు

Wednesday,June 14,2017 - 04:36 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిన దంగల్ సినిమాకు చైనాలో ఇంకా వసూళ్లు వస్తూనే ఉన్నాయి. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకు చైనాలో ఏకంగా 1948 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పటికే బాహుబలి-2ను క్రాస్ చేసిన ఈ సినిమా త్వరలోనే 2000 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మంగళవారం వసూళ్లతో చూస్తే చైనాలో దంగల్ కు 1164 కోట్ల రూపాయలు వచ్చాయి. తైవాన్ నుంచి దంగల్ కు 40 కోట్లు వచ్చాయి. తాజా వసూళ్లతో లెక్క 1948 కోట్ల రూపాయలకు చేరింది. మరోవైపు ఈ సినిమా అత్యథిక వసూళ్లు సాధించిన నాన్-హాలీవుడ్ మూవీస్ లిస్ట్ లో టాప్-5లో చోటు దక్కించుకుంది.

 

నాన్-ఇంగ్లిష్ ఫిలిమ్స్ లిస్ట్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చైనాకు చెందిన ‘ది మెర్మయిడ్’ చిత్రం నంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్ టచబుల్స్’ ఉంది. ఈ లిస్ట్ లో ఐదోస్థానంలో దంగల్ నిలిచింది. హాలీవుడ్ సినిమాల్ని మినహాయిస్తే.. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాల్లో దంగల్ చేరడం ఇండియాకే గర్వకారణం.