మూడు రోజుల్లో 100 కోట్లు...

Monday,December 26,2016 - 03:30 by Z_CLU

అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘దంగల్’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మహావీర్ సింగ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. తొలి రోజు నుంచే తన హవా చూపించడం మొదలుపెట్టింది.

    బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో ముందుకెళ్తున్న ‘దంగల్’.. తొలి రోజు రూ.29 .78 కోట్లు కలెక్ట్ చేయగా రెండో రోజు రూ.34 .82 కోట్లు, మూడో రోజు రూ.42 .35 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే అవలీలగా 100 కోట్లు మార్క్ అందుకొని, టోటల్ గా 106 కోట్లు తో సాధించి అమీర్ ఖాన్ కెరీర్ లో మరో 100 కోట్ల సినిమాగా నిలిచింది దంగల్. ఓవర్సీస్ లో ఈ సినిమా ఇండియాా కంటే 2 రోజుల ముందే విడుదలైంది.