రాజ్ తరుణ్ ప్లేస్ లో దగ్గుబాటి హీరో ?

Wednesday,July 20,2016 - 10:04 by Z_CLU

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ప్రస్తుతం సూపర్ హిట్స్ తో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న యువ హీరో ఎవరంటే ఠక్కున వినిపించే పేరు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల -జంపాల’ సినిమాతో హీరో గా పరిచయమై తొలి సినిమాతో గ్రాండ్ హిట్ తో పాటు కథానాయకుడిగా చక్కటి గుర్తింపు అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తరువాత కూడా వరుసగా మూడు సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల నుండి తప్పుకుంటున్నాడు. ఇక ఈ కుర్ర హీరో కి కాసింత దర్శకత్వం పై అవగాహన ఉండటం వలనే కొన్ని కథలకు నో చెప్తున్నాడా? అనే అనుమానాలు కూడా పరిశ్రమలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఓ సినిమాలో రాజ్ తరుణ్ ప్లేస్ లో దగ్గుబాటి హీరో రావడం తో ఒక్కసారి గా అందరి చూపు రాజ్ తరుణ్ పై పడింది.

ఇక విషయం లోకెళితే మొన్నా మధ్య సీనియర్ దర్శకుడు వంశీ … రాజ్ తరుణ్ తో క్లాసిక్ కామెడీ మూవీ ‘లేడీస్ టైలర్’ కు సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని రాజ్ తరుణ్ కూడా కొన్ని ఇంటర్ వ్యూస్ లో చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో సడెన్ గా మరో హీరో పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ తో ఈ సినిమాను రూపొందించాలని వంశీ భావిస్తున్నట్లు… ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్ . మరి ఈ సినిమా నుండి రాజ్ తరుణ్ ఎందుకు తప్పుకున్నాడనే అంశంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.