"సరిలేరు.." స్పెషల్ సాంగ్ రిలీజ్

Sunday,December 29,2019 - 06:57 by Z_CLU

మహేష్ హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే అవన్నీ ఒకెత్తు, తమన్న చేసిన స్పెషల్ సాంగ్ ఒకెత్తు. ఎట్టకేలకు ఆ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ పార్టీ థీమ్ తో సాగే ఈ పాటలో మహేష్ బాబు డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్

తమన్న ఎలాగూ డాన్స్ చేస్తుంది. ఆమె డాన్స్ కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. డ్యాంగ్..డ్యాంగ్ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో కూడా తమన్న డాన్స్ చించేసింది. కాకపోతే చాన్నాళ్ల తర్వాత మహేష్ బాబు స్టెప్పులేయడం ఈ సాంగ్ కు ఎక్స్ ట్రా కలర్ తీసుకొచ్చింది.

గతంలో కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్స్ తో ఐటెంసాంగ్స్ స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు దేవిశ్రీప్రసాద్. ఈ పాటకు కూడా తనదైన టచ్ ఇచ్చాడు. ఇది ఏ రేంజ్ హిట్టవుతుందనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. నకాష్-లవిత కలిసి ఆలపించారు.