Daakko Daakko Meka - పుష్ప ఫస్ట్ సాంగ్ రిలీజ్

Friday,August 13,2021 - 11:55 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ పుష్ప సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. దాక్కో దాక్కో మేక అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ను దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేశాడు. ఓవైపు దేవిశ్రీ ట్యూన్, మరోవైపు బన్నీ మేకోవర్ కలిసి ఈ పాటను ఇనిస్టెంట్ హిట్ చేశాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలున్నాయి. మూవీపై ఎన్ని అంచనాలున్నాయో.. సాంగ్స్ పై కూడా అంతకుమించి అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా వచ్చింది పుష్ప ఫస్ట్ సింగిల్.

పాట మాస్ అయినా, సాహిత్యం మాత్రం పక్కా క్లాస్. ఎంతో వేదాంతం ఒలకబోశాడు చంద్రబోస్. బతుకు పోరాటంలో ప్రతి జీవికి ఓ ఎర అవసరమని, ఎవరికైనా ఆకలి వేస్తే మరొకరు బలవ్వాల్సిందేననే ప్రకృతి సత్యాన్ని విడమర్చి చెప్పాడు. శివమ్ ఈ పాటను ఆలపించాడు.

ఇక బన్నీ విషయానికొస్తే అతడి లుక్, సిగ్నేచర్ స్టెప్ సాంగ్ లో హైలెట్ గా నిలిచాయి. పుష్పలో బన్నీ ఎలా ఉంటాడనే విషయం ఇంతకుముందే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏకంగా వీడియోలో బన్నీ నయా అవతార్ ను చూపించారు. అతడి గడ్డం, కత్తి పట్టే విధానం, వాకింగ్ స్టయిల్.. ఇలా అన్నీ ఎంతో కొత్తగా ఉన్నాయి. ఇక ఈ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ ను కూడా లిరికల్ వీడియోలో చూపించారు. ఓ మూమెంట్ కు, ఎక్స్ ప్రెషన్ కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సిగ్నేచర్ స్టెప్ లో చూడొచ్చు.

ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా సినిమా పార్ట్-1 ది రైజ్ విడుదల కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics