సంక్రాంతి కానుకగా 'సైకిల్'

Wednesday,January 13,2021 - 03:41 by Z_CLU

పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర, శ్వేతావ‌ర్మ‌, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం సైకిల్. గ్రే మీడియా బ్యాన‌ర్ పై, ఓవ‌ర‌సీస్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, ఓంశ్రీ మ‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 15వ తేదీన రిలీజ్ అవుతుంది.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుద‌ర్శ‌న్‌, అనితాచౌద‌రి, క్యారెక్ట‌ర్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయని యూనిట్ చెబుతోంది. వీళ్ల‌తోపాటు, సూర్య‌, మ‌ధుమ‌ణి, న‌వీన్‌నేని, ఆర్ఎక్స్‌100 ల‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ జోగీబ్ర‌ద‌ర్స్ కూడా చాలా ఎంట‌ర్‌టైన్ చేస్తారు. కామెడీ జోన‌ర్ సినిమాకి ల‌వ్‌స్టోరీ యాడ్ చేసి ఈ మూవీ తెరకెక్కించారు.

త్వ‌ర‌లో టీజ‌ర్‌తో పాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేట‌ర్స్‌లోకి రాబోతున్న ఈ సైకిల్ చిత్రానికి నిర్మాత‌లు, పి.రాంప్ర‌సాద్‌, డి.న‌వీన్‌రెడ్డి. జి.ఎం.స‌తీష్‌ సంగీతం అందించాడు.