ఒక్క మహేష్ బాబు తప్ప

Thursday,January 12,2017 - 03:00 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నాడు..? ఎలాంటి ప్లాన్స్ చేసినా… ఆ లిస్టులో తన ఆన్ సెట్స్ సినిమా ఫస్ట్ లుక్ ఉందా..? ఫస్ట్ లుక్ కాకపోతే అట్ లీస్ట్ టైటిల్… అయినా అనౌన్స్ చేస్తాడా..? ఇవీ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలోనే కాదు, బయట ఎక్కడ కలుసుకున్నా రొటీన్ గా చేసుకుంటున్న డిస్కషన్స్.

న్యూ ఇయర్ నుండి బిగిన్ అయితే సంక్రాంతి వరకు టాలీవుడ్ స్టార్స్ ఏదో ఓ అప్ డేట్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఒక్క మహేష్ బాబు తప్ప… ఒకేసారి మహేష్ బాబు ఇంత సైలెంట్ మోడ్ లోకి వెళ్ళడానికి రీజన్స్ అయితే తెలీడం లేదు కానీ, ఫ్యాన్స్ లో మాత్రం సూపర్ స్టార్ గ్రాండ్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడనే ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే సెట్ అవుతున్నాయి.

మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహేష్ బాబు సినిమా ఇప్పటికే టాలీవుడ్ సైలెంట్ సెన్సేషన్ లా మారింది. అటు సోషల్ మీడియాలో మహేష్ బాబు నుండి ఏ అప్ డేట్ వస్తుందోనని కాచుకుని కూర్చున్న ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్టు, ఏ చిన్న అప్ డేట్ బయటికి వచ్చినా టాలీవుడ్ వైబ్రేట్ అవ్వడం గ్యారంటీ.