ప్రశంసలు అందుకుంటున్న ధనుష్...

Sunday,April 16,2017 - 11:00 by Z_CLU

మొన్నటి విభిన్న పాత్రలతో నటుడిగా ఎంటర్టైన్ చేసి ప్రశంశలు అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ గా దర్శకుడిగా కూడా అందరి ప్రసంశలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు..

ధనుష్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘పవర్ పాండి’ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. తొలి రోజే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ధనుష్ కి దర్శకుడిగా ప్రశంశల వర్షం కురిపిస్తుంది.. సీనియర్ నటుడు రాజ్ కిరణ్, రేవతి ప్రధాన పాత్రలో ధనుష్ అతిధి పాత్రలో నటించిన ఈ సినిమా కోలీవుడ్ ఆడియన్స్ తో పాటు ప్రముఖులను, విశ్లేషకులను సైతం ఆకట్టుకొని సూపర్ హిట్ గా నిలిచింది.. ఇక ఇప్పటి వరకూ నటుడిగా, నిర్మాతగా మాత్రమే గుర్తింపు అందుకున్న ధనుష్ ఈ సినిమాతో దర్శకుడిగా కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు..