Mahesh Sarkaru Vaari Paata - సూపర్ అప్ డేట్ ఇది

Monday,October 11,2021 - 02:36 by Z_CLU

Crazy Updates from Mahesh’s Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట‘ సినిమా నుండి అప్ డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. దీనికి రీజన్ తమన్ ఇచ్చిన హింట్. అవును నవంబర్ నుండి సినిమా సాంగ్స్ మార్కెట్ లోకి వస్తాయి అంటూ కొన్ని నెలల ముందే భరోసా ఇచ్చాడు తమన్. ఇక మేకర్స్ కూడా ఫస్ట్ సింగిల్ ను వచ్చే నెలలో దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. త్వరలోనే అప్ డేట్ రానుంది.

సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ టైంలోనే టైటిల్ ట్రాక్ తో చిన్న బిట్ వదిలారు మేకర్స్. ఆ బిట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి దాన్నే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తారా ? లేదా అది జస్ట్ బిజిఎం వరకే వాడనున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆల్బంలో సిద్ శ్రీరామ్ తో ఒక పాట పాడించే ఆలోచనలో ఉన్నారు. దర్శకుడు పరశురాం డైరెక్ట్ చేసిన ‘గీత గోవిందం’ సినిమాలో సిద్ పాడిన ‘ఇంకేం ఇంకేం కావాలె’ సాంగ్ సెన్సేషనల్ అయింది. ఆ సాంగ్ తో సిద్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. అదే సినిమాలో మరో పాట కూడా పాడించుకున్నాడు దర్శకుడు.

ఇక తమన్ కంపోజిషన్ లో సిద్ పాడిన ‘సామజ వరగమనా’, ‘మగువా మగువా’ సాంగ్స్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయో తెలిసిందే. సో ఇప్పుడు సర్కారు వారి పాటలో ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ కోసం సిద్ తో పాట పాడించే పనిలో ఉన్నారని సమాచారం. ఈ విషయంపై కూడా మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వాళ్ళ సినిమా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు. ఉగాదికి సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics