పవన్ కోసం కాస్ట్ లీ సెట్

Tuesday,November 05,2019 - 03:24 by Z_CLU

పవన్ రీఎంట్రీ ఇస్తారా ఇవ్వరా?
రీఎంట్రీ ఇస్తే ఆ సినిమా ఏంటి?
ఇప్పటివరకు బజ్ ఈ రెండు ఎలిమెంట్స్ చుట్టూనే నడిచింది. కానీ ఇప్పుడు ఇంకాస్త అడ్వాన్స్ గా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. పవన్ పింక్ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఈ సినిమా కోసం ఇప్పుడు ఓ సెట్ కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారట.

అవును.. పింక్ తెలుగు రీమేక్ కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో ఓ భారీ కోర్టు సెట్ నిర్మించబోతున్నారట. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ నిర్మాతగా ఈ సినిమా వస్తుందట. ప్రస్తుతం ఫిలింనగర్ లో వినిపిస్తున్న బజ్ ఇది. దీనిపై క్లారిటీ మాత్రం ఎవ్వరూ ఇవ్వడం లేదు.

రీసెంట్ గా తన రీఎంట్రీపై పవన్ మరోసారి రియాక్ట్ అయ్యారు. చాలామంది రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉన్నాయని, అలాంటప్పుడు తను మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేంటంటూ ప్రశ్నించారట పవన్. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా పవర్ స్టార్ రీఎంట్రీ పక్కా అంటూ మరోసారి ఫ్యాన్స్ హంగామా చేయడం స్టార్ట్ చేశారు.