రేపే స్పైడర్ ఆడియో రిలీజ్ – కౌంట్ డౌన్ బిగిన్స్

Friday,September 08,2017 - 05:29 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ మానియా కంప్లీట్ సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. గతంలో రిలీజైన ‘బూమ్ బూమ్’ సాంగ్ తరవాత రీసెంట్ గా రిలీజైన ‘హాలి హాలి’ సాంగ్ అటు యూత్, ఇటు మాస్ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసేశాయి. ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ రేపు రిలీజ్ కాబోయే ఆడియో జ్యూక్ బాక్స్ పైనే ఫిక్సయి ఉంది.

రేపు చెన్నై లో జరగనున్న ఆడియో రిలీజ్ ఈవెంట్ లో తమిళ ఆడియో రిలీజ్ తో పాటు, తెలుగు ఆడియోని రిలీజ్ చెయ్యబోతున్నారు. డైరెక్టర్ శంకర్ తో పాటు రాజమౌళి కూడా అటెండ్ కానున్న ఈ ఈవెంట్, అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది. ఈ సినిమాతో మహేష్ బాబు  కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఎక్కడ చూసినా స్పైడర్ ఫీవర్ కనిపిస్తుంది.

 మొత్తం ఐదు పాటలుండబోయే ఈ సినిమాలో ఆల్ రెడీ 2 సాంగ్స్ రిలీజయ్యాయి. ఈ పాటలతో పాటు ‘సిసీలియా సిసీలియా’, ‘అచ్చం తెలుగందం’ పాటలతో పాటు ‘స్పైడర్ ఆన్ మిషన్’ అనే సాంగ్స్ రేపు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి S.J. సూర్య విలన్ గా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.