ఇస్మార్ట్ శంకర్’ – వారణాసీకి ఉన్న కనెక్షన్..?

Tuesday,July 09,2019 - 12:02 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ లో వారణాసి సీక్వెన్సెస్ స్పెషల్ గా ఉండబోతున్నాయా..? సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు పక్కా హైదరాబాదీ అని… సినిమా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో అని ప్రమోట్ చేసిన మేకర్స్.. వారణాసీ సీక్వెన్సెస్ ని మాత్రం చాలా స్పెషల్ గా ప్రెజెంట్ చేస్తున్నారనిపిస్తుంది.

మరీ ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ లో రామ్ లుక్స్ కంప్లీట్ గా వేరు… మిగతా చోట్ల హైదరాబాదీలా 100% మాస్ గెటప్ లో కనిపిస్తున్న రామ్ వారణాసీ లో విశ్వరూపం చూపించబోతున్నాడనిపిస్తుంది. రామ్ లుక్స్ లోనే ఆ స్థాయి వేరియేషన్స్ ఉన్నాయంటే, ఖచ్చితంగా ‘ఇస్మార్ట్ శంకర్’ లో వారణాసీ ఎపిసోడ్ మరింత స్పెషల్ అనిపించుకోనుంది.

సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా… హీరో మైండ్ లో ఇంకో చిప్ పెడతారు అన్న ఒకే ఒక పాయింట్ రివీల్ చేసి, ఆడియెన్స్ లో నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ  జెనెరేట్ చేస్తున్న మేకర్స్.. ఈ హైదరాబాదీకి వారణాసీకి ఉన్న కనెక్షన్ మాత్రం ఎక్కడా రివీల్ చేయడం లేదు.

కీ పాయింట్ ఏంటనేది సినిమా రిలీజయితే కానీ గెస్ చేయడం కష్టం కానీ… ప్రస్తుతానికైతే ఈ ఎపిసోడ్ నుండి భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ ని మాత్రం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు…