అయోమయంలో సమంత..

Saturday,October 08,2016 - 10:30 by Z_CLU

మనకేదైనా మంచి జరిగితే హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే మనం ప్రేమించే వారెవరికైనా మంచి జరిగితే ఇంకాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ తన కాబోయే భర్త నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమా పై వస్తున్న పాజిటివ్ టాక్ చూస్తుంటే గట్టిగా అరవాలో, ఏడవాలో లేక నవ్వాలో తెలియని పరిస్థితుల్లో ఉందట మన సమంత.

    నాగ చైతన్య, సమంతా ల పెళ్లి అఫీషియల్ గా ఎనౌన్స్ కాకముందు నుండే పబ్లిక్ గా తన ఫీలింగ్స్ ని బయట పెడుతున్న సమంతా, నాగ చైతన్య ప్రేమమ్ సినిమా విషయంలోనూ అంతే యాక్టివ్ గా సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేస్తుంది.

ప్రేమమ్ రిలీజ్ కి ముందు నుండే పరోక్షంగా ప్రమోట్ చేసిన సమంతా సినిమా రిలీజైన కాసేపటికే సంతోషంతో ఈ ట్వీట్ చేసింది. సంతోషం మరీ ఎక్కువైపోయినపుడు అరుస్తామో, ఏడుస్తామో, గెంతులేస్తామో? నవ్వుతామో? నేనయితే ఇప్పుడు అన్నీ చేస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి సమంతా తన కాబోయే భర్త కష్ట సుఖాల్లో ఇప్పటి నుండే పాలు పంచుకుంటుందన్న మాట.