మిల్కీ బ్యూటీకి కొత్త చిక్కులు

Friday,September 30,2016 - 02:39 by Z_CLU

ప్రొఫెషనలిజం కి పక్కా డెఫినిషన్ తమన్నా. అలాంటి తమన్నాపై కేసు ఫైల్ అయింది. తన పదేళ్ళ సినిమా కరియర్ లో తమన్నాపై ఇలాంటి అభియోగం పడటం బహుశా ఇదే మొదటిసారి. సినిమాకి సంతకం పెట్టింది మొదలు, ప్రమోషన్స్ వరకు పకడ్బందీగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని దర్శక నిర్మాతలకు కో ఆపరేట్ చేసే తమన్నా, తన సినిమా ప్రమోషన్స్ కి రాలేదని తమిళ నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు ఓ నిర్మాత.

siv_39490248-1

రీసెంట్ గా రిలీజ్ అయి, హిట్ టాక్ కూడా తెచ్చుకున్న తమిళ సినిమా ‘ధర్మ దురై’ నిర్మాత సురేష్…. తమన్నా తన సినిమా ప్రమోషన్స్ కి ఏమాత్రం కోపరేట్ చేయలేదని, అదే తన రాబోయే చిత్రం ‘అభినేత్రి’ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతుందని ఆరోపిస్తున్నాడు. ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సదరు నిర్మాత ఏ సంఘంలో అయితే కంప్లైంట్ చేశాడో ఆ సంఘానికి చీఫ్ సెక్రటరీ విశాల్. తమన్నా విశాల్ తో కూడా ‘కత్తి సందై’ సినిమాలో నటిస్తుంది. అలాంటప్పుడు ఈ కేసును మన హీరో ఎలా డీల్ చేస్తాడో చూడాలి.