ఈ హీరోయిన్స్ కొంచెం డిఫెరెంట్...

Friday,October 18,2019 - 11:02 by Z_CLU

ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలంటే హీరోయిన్స్ కి ఓ రేంజ్ ఉండాలి. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోల సరసన నటించేసి టాప్ హీరోయిన్ అనిపించుకోవాలి. అప్పుడే ఓ సినిమాలో హీరో లేకపోయినా జస్ట్ ఆ హీరోయిన్ కి ఉన్న క్రేజ్ తో సినిమాకి మైలేజ్ వస్తుంది అయితే ఈ హీరోయిన్స్ మాత్రం ఆ ఫిలాసఫీ కొంచెం దూరం.

కీర్తి సురేష్ : ‘మహానటి’ నాటికి కీర్తి సురేష్ చేసింది జస్ట్ 3 సినిమాలే. ఈ సినిమా తరవాత సంతకం చేస్తే మరో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా ‘మిస్ ఇండియా’కే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్ నగేష్ కుకునూర్ డైరెక్షన్ లో మరో ఇన్స్ పైరింగ్ రోల్ లో కనిపించనుంది. స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ప్రయత్నిస్తుందనుకుంటే వాళ్లకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి సురేష్.

 నందిత శ్వేత : పరిచయమైంది ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో. ఒక్క సినిమాతోనే తెలుగు సినిమాకి మరో మంచి నటి దొరికింది అనిపించుకుంది. ఈ షకెస్ తో నందిత స్టార్ హీరో సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం గ్యారంటీ అనుకున్నారు. కానీ నందిత మొదటి నుండే ఫోకస్ మరో వైపు పెట్టింది. చేస్తే హీరోల సరసన పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు.. లేకపోతే అక్షర లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు.. గ్లామరస్ హీరోయిన్ రేస్ లో నందిత ఇప్పట్లో దిగేలా లేదు.

ఈషారెబ్బ : ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈషా రెబ్బ పేరు టాప్ హీరోయిన్స్ లో లేదు కానీ, ఈ హీరోయిన్ కరియర్ గ్రాఫ్ చూస్తే చేసినవన్నీ మంచి సినిమాలే. స్టార్ హీరోల సరసన అవకాశాల కోసం ఓ వైపు గట్టిగా ట్రై చేస్తూనే, మరోవైపు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ‘రాగల 24 గంటల్లో’ సినిమాతో ఈ జోనర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈషా.