సప్తగిరి హీరోగా మరో సినిమా

Thursday,March 02,2017 - 08:09 by Z_CLU

సక్సెస్ ఫుల్ కమెడియన్ గా రాణిస్తూనే మరోవైపు ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా కూడా క్కరియర్ ని పర్ ఫెక్ట్ ట్రాక్ లో ప్లాన్ చేసుకున్న సప్తగిరి మరో సినిమాలో హీరోగా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఆల్ రెడీ టైటిల్ ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్. గతంలో సప్తగిరి ఎక్స్ ప్రెస్ గా ఎంటర్ టైన్ చేసిన ఈ సక్సెస్ ఫుల్ కమేడియం ఈ సారి ‘రివాల్వర్ రాజు’ మన ముందుకు రాబోతున్నాడు.

 

ఓ వైపు నాగ చైతన్య, కళ్యాణ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కమెడియన్ గా తన మార్క్ క్యారెక్టర్ లో నటిస్తున్న సప్తగిరి, ఈ సినిమాతో పాటు శర్వానంద్, నాగ అన్వేశ్ సినిమాల్లోనూ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కమెడియన్ గా కంటిన్యూ అవుతూనే మరో వైపు సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కూడా ఎంటర్ టైన్ చేస్తున్నాడు సప్తగిరి.  ఈ సినిమాకి సంబంధించి మిగతా డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.