కాంబినేషన్ ఫిక్స్.. కానీ ఎప్పుడొస్తుందో చెప్పలేం

Wednesday,October 17,2018 - 10:02 by Z_CLU

ఇవి ప్రేక్షకులు, అభిమానుల ఊహలు కావు. సాధ్యంకాని కాంబినేషన్లు అంతకంటే కావు. ఇంకా చెప్పాలంటే అన్నీ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్టులే. ఇద్దర్లో ఒకరు కన్ ఫర్మ్ చేసిన సినిమాలే. కానీ అవి ఎప్పుడొస్తాయో ఎవరూ చెప్పలేరు. అలా ఆడియన్స్ లో నలుగుతూ, సెట్స్ పైకి రాని క్రేజీ కాంబోలు కొన్ని చూద్దాం.

రామ్ చరణ్ -కొరటాల శివ
మెగా ఫాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కాంబో ఇది. ఇప్పటికే 2-3 సార్లు ప్రారంభం వరకూ వెళ్లిన ఈ కాంబో ఎందుకో తెరపైకి మాత్రం రాలేకపోయింది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై చరణ్, కొరటాల సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది. కానీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఒక్క అప్డేట్ కూడా లేదు.


మహేష్-సుకుమార్
సుకుమార్ – మహేష్ కాంబోలో ఇప్పటికే ఒక సినిమా వచ్చింది.. మళ్ళీ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేష్ తో ఓ సినిమా చేస్తానని సుకుమార్ స్వయంగా ప్రకటించాడు. కానీ అది ఎప్పుడనేది క్లారిటీ లేదు. ఇప్పటికే రెండు సిట్టింగ్స్ జరిగినా కథ మాత్రం కొలిక్కి రాలేదని టాక్.


ఎన్టీఆర్ – కొరటాల శివ
ఈ కాంబో కూడా బాగా వెయిట్ చేయిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ ఏ రేంజ్ హిట్ అందుకుందో తెలిసిందే. గతేడాది సరిగ్గా దసరాకి తారక్ -కొరటాల కాంబోలో రెండో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. మరో దసరా వస్తోంది కానీ అప్ డేట్ మాత్రం లేదు. రాజమౌళి సినిమా తర్వాత కొరటాలతోనే సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పినా అది సెట్స్ పైకి వచ్చేసరికి చాలా టైం పడుతుంది.


మహేష్-రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా అంటూ ఎప్పట్నుంచో వార్తలొస్తున్నాయి. సినిమా తప్పకుండా ఉంటుందని అటు మహేష్, ఇటు రాజమౌళి ఇద్దరూ చెబుతున్నారు. కానీ కాంబినేషన్ మాత్రం సెట్ అవ్వడం లేదు. అశ్వనీదత్ లాంటి నిర్మాతలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసినా పాజిటివ్ రిజల్ట్ రాలేదు.


చిరంజీవి-కొరటాల
దాదాపు 2 నెలలుగా ఫిలింనగర్ లో నలుగుతున్న చర్చ ఇది. సినిమా అయితే పక్కా. కానీ ఆ విషయాన్ని కొరటాల చెప్పడం లేదు. చిరంజీవి అస్సలు కనిపించడం లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి లీకులు లేవు. ఈ కాంబినేషన్ పై ఓ క్లారిటీ రావాలంటే, సైరా సినిమా థియేటర్లలోకి రావాల్సిందే.


బాలయ్య-బోయపాటి
బాలయ్య -బోయపాటి ది బ్లాక్ బస్టర్ కాంబో.. ఇద్దరూ కలిసి ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. బాలయ్య -బోయపాటి శ్రీను కాంబోలో మూడో సినిమా కూడా రానుంది. బాలయ్య 100 వ సినిమా నుండి ఈ కాంబోపై చర్చ నడుస్తోంది. కానీ ఎందుకో ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం బాలయ్య తో కుదిరినప్పుడల్లా స్టోరీ సిట్టింగ్స్ వేస్తున్నాడు బోయపాటి. లేటెస్ట్ గా బాలయ్య కూడా తన నెక్స్ట్ సినిమా బోయపాటి తోనే అంటూ చెప్పుకొచ్చాడు. మరి వచ్చే ఏడాది అయినా ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వస్తుందేమో..చూడాలి.


మహేష్ – త్రివిక్రమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి.. ముచ్చటగా మూడో సినిమా చేయడానికి ఇద్దరూ రెడీగా ఉన్నారు కానీ ఎందుకో స్టోరీ సెట్ అవ్వడం లేదు. ఇటీవలే మహేష్ తో సినిమాపై స్పందించిన త్రివిక్రమ్ కచ్చితంగా మళ్ళీ తమ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని చెప్పాడు. కానీ ఎందుకో కుదరట్లేదు అని కూడా చెప్పుకొచ్చాడు. మహేశ్ కూడా త్రివిక్రమ్ తో చేయడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాడు.


వెంకటేష్ – త్రివిక్రమ్
అభిమానులను ఊరిస్తున్న ఎంటర్టైన్మెంట్ కాంబో వెంకటేష్ – త్రివిక్రమ్. కెరీర్ స్టార్టింగ్ లో వెంకటేష్ తో 2 సినిమాలకు పనిచేసిన త్రివిక్రమ్ అప్పట్నుంచి వెంకీ తో సినిమా చేయాలనీ చూస్తున్నా ఎందుకో కుదరట్లేదు. ఇటివలే వీరిద్దరి కాంబినేషన్ లో హారిక-హాసిని బ్యానర్ పై సినిమా ఎనౌన్స్ అయింది. అంతే, అక్కడ్నుంచి అంగుళం కూడా ముందుకు కదల్లేదు.


అల్లు అర్జున్ – విక్రమ్ కుమార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విక్రం కుమార్ తో సినిమా చేస్తున్నాడనే వార్త ఇప్పటిది కాదు. ఇప్పటికే వీరిద్దరి మధ్య నాలుగైదు సిట్టింగ్స్ కూడా జరిగాయి. కానీ అఫీషియల్ స్టేట్ మెంట్ మాత్రం బయటకు రావట్లేదు. వీరిద్దరి కాంబోలో సినిమా అయితే కన్ఫర్మ్ కానీ అదేప్పుడనేది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలి ఉంది.


అఖిల్ – బోయపాటి శ్రీను
అఖిల్ తో ఓ సినిమా చేస్తానని జయజానకి నాయక టైమ్ లోనే ప్రకటించాడు బోయపాటి. కానీ వరుస ప్రాజెక్టులతో అటు అఖిల్, ఇటు బోయపాటి ఇద్దరూ బిజీగా ఉన్నారు. మిస్టర్ మజ్ను తర్వాత అఖిల్, బోయపాటిని తన కాంపౌండ్ లోకి తీసుకొస్తాడేమో చూడాలి.