మరో రికార్డు సృష్టించిన నయనతార

Monday,August 27,2018 - 12:36 by Z_CLU

తనను అంతా ఫిమేల్ సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారా మరోసారి ప్రూవ్ చేసుకుంది నయనతార. తన గత చిత్రాలతో ఇప్పటికే బాక్సాఫీస్ బరిలో తన స్టామినా చూపించిన నయన్, తాజాగా కొలమావు కోకిల చిత్రంతో తన రికార్డును తానే అధిగమించింది.

గతవారం తమిళనాట విడుదలైన ఈ సినిమా ఏకంగా 20 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీకి 20 కోట్ల రూపాయల వసూళ్లు రావడం కోలీవుడ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఈ మూవీలో నయనతార మార్కెట్ మరింత పెరిగింది.

కోకిలగా నయన్ యాక్టింగ్, యోగిబాబు కామెడీ, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్.. కొలమావు కోకిల సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా టాలీవుడ్ తెరపైకి కూడా రాబోతోంది ఈ సినిమా. తెలుగులో దీనికి కోకో కోకిల అనే పేరుపెట్టారు.