న‌వంబ‌ర్ 10న "కేరాఫ్ సూర్య" విడుద‌ల

Thursday,October 19,2017 - 05:03 by Z_CLU

న‌గ‌రం, స‌మంత‌క‌మ‌ణి లాంటి చిత్రాల త‌రువాత సందీప్ కిషన్… మ‌హ‌నుభావుడు, రాజాదిగ్రేట్ చిత్రాల త‌రువాత హ్య‌ట్రిక్ క్వీన్‌ మెహ్రీన్ జంటగా… నా పేరు శివ లాంటి నేచుర‌ల్ హిట్ ని అందించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేరాఫ్ సూర్య. సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 10న విడుదలకానుంది.

శంక‌ర్‌ చిగురుపాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో , స్వామిరారా, వీడుతేడా లాంటి మంచి చిత్రాల త‌రువాత‌  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్, రెండు సాంగ్స్‌ తో ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది. టీజర్ ను నాని రిలీజ్ చేయగా.. రకుల్, కాజల్ సాంగ్స్ రిలీజ్ చేశారు.

ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్, లవ్ తో పాటు ఓ యూనిక్‌ పాయింట్ ను ఇందులో చెప్పబోతున్నారు.. ఇమ్మాన్ మ్యూజిక్ మరో ఎస్సెట్ గా నిలవబోతోంది. త్వరలోనే ధియోట్రిక్ ట్రైల‌ర్ ని, ఆడియో ఫంక్ష‌న్ ని పెట్టబోతున్నారు.