కేరాఫ్ కంచరపాలెం రీమేక్

Tuesday,May 28,2019 - 05:07 by Z_CLU

గతేడాది విడుదలైన చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో విజయం సాధించిన వాటిలో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఒకటి. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది. నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. గతంలో ఇతడు త్రిపుర చిత్రాన్ని నిర్మించాడు.

‘‘ ఈ మధ్య నేను చూసిన బెస్ట్‌ సినిమా ‘కేరాఫ్‌ కంచెరపాలెం’. ఆ సినిమాలోని చాలా సన్నివేశాలకు నేను కనెక్ట్‌ అయ్యాను. సినిమా చూడగానే డైరెక్ట్‌గా సురేశ్‌బాబు దగ్గరికెళ్లి ఫ్యాన్సీ రేట్‌ చెల్లించి ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రం తమిళ, మలయాళ రైట్స్‌ను సొంతం చేసుకున్నాను. సినిమా రైట్స్‌ సొంతం చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశాం.”

ఇలా సినిమాకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాడు నిర్మాత. అయితే తమిళ, మలయాళ వెర్షన్లలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. పూర్తిగా కొత్త నటీనటులతో వెళ్తారా, లేక ఆల్రెడీ పాపులర్ అయిన హీరోహీరోయిన్లను తీసుకుంటారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.