రానా ‘C/O కంచరపాలెం’ ఎందుకంత స్పెషల్...?

Thursday,August 09,2018 - 03:38 by Z_CLU

రానా దగ్గుబాటి సమర్పిస్తున్న C/O కంచరపాలెం సెప్టెంబర్ 7 న రిలీజవుతుంది. రానా స్వయంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తాడు. ఈ వీకెండ్ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను రివీల్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

ఈ సినిమా ఇప్పటికే చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్ ని కూడా అంతే యూనిక్ గా, ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ రేజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు ఫిలిమ్ మేకర్స్.

ఇకపోతే త్వరలో ఈ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ అనౌన్స్ చేయనున్న సినిమా యూనిట్, త్వరలో  సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. వెంకటేష్ మహ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని విజయ ప్రవీణ పరుచూరి నిర్మించారు.