శతమానంభవతి టీంకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

Thursday,May 18,2017 - 06:00 by Z_CLU

సంక్రాంతి కానుకగా విడుదలైన శతమానంభవతి సినిమా సూపర్ హిట్ అయింది. విడుదలైన ప్రతి కేేంద్రంలో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా పాపులర్ చిత్రంగా ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఈమధ్యే రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడా టీం ను ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

శతమానంభవతి టీంతో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించిన ముఖ్యమంత్రి హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజును వ్యక్తిగతంగా అభినందించారు. సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా, జాతీయ అవార్డులు వచ్చేలా సినిమాలు తీయాలని సూచించారు.

తాజాగా శతమానంభవతి సినిమా టీవీలో కూడా టెలికాస్ట్ అయింది. ఉగాది కానుకగా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారమైన ఈ సినిమాకు బుల్లితెర ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. టీఆర్పీల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది శతమానంభవతి సినిమా.