2.0 టీజర్ రిలీజ్ పై క్లారిటీ

Saturday,January 06,2018 - 11:03 by Z_CLU

రజినీకాంత్ 2.0 మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే నిన్నా మొన్నటి వరకు ఈ సినిమా టీజర్ మలేషియాలో ఈ రోజు జరుగుతున్న స్టార్ నైట్ ఈవెంట్ లో రిలీజ్ కానుందనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే నడిచినా, ఈ సినిమా టీజర్ ఈ ఈవెంట్ లో రిలీజ్ అవ్వడం లేదు.

కోలీవుడ్ కి చెందిన మ్యాగ్జిమం స్టార్స్ అటెండ్ కానున్న ఈ ఈవెంట్ లో రజినీకాంత్ కూడా అటెండ్ అవుతున్నారు. కానీ ఈ ఈవెంట్ లో 2.0  టీజర్ ని రిలీజ్ చేయట్లేదని క్లారిటీ ఇచ్చిన సినిమా యూనిట్, బిగినింగ్ లో అనౌన్స్ చేసినట్టు ఈ సినిమా టీజర్ ని హైదరాబాద్ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ స్టార్ నైట్ లో కొత్తగా 2 పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం టీజర్ మేకింగ్ ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేశాడు.