నా పేరు సూర్య స్టోరీ పై క్లారిటీ

Friday,February 02,2018 - 02:47 by Z_CLU

అల్లు అర్జున్ అప్  కమింగ్ మూవీ ‘నా పేరు సూర్య’.  ఈ సినిమా ‘ఆంట్ వోన్ ఫిషర్’ అనే హలీవుడ్ సినిమాకి రీమేక్ అనే రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. అయితే  ఈ విసయంలో ఈ సినిమా నిర్మాత  లగడపాటి  శ్రీధర్  క్లారిటీ ఇచ్చాడు.

‘ఆంట్ వోన్ ఫిషర్ సినిమా నేను కూడా చూశాను. ఆ సినిమాకి ‘నా పేరు సూర్య’ ఏ మాత్రం సంబంధం లేదు. ‘ఆంట్ వోన్ ఫిషర్’ అనే సినిమా ఆటోబయోగ్రఫీ మూవీ. నా పేరు సూర్య కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంటుంది’ అని చెప్పాడు  లగడపాటి శ్రీధర్.

అల్లు అర్జున్ యాంగ్రీ మిలిటరీ మ్యాన్ లా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది.