Mega Remakes పై క్లారిటీ రానుందా?

Monday,August 17,2020 - 03:02 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య (Acharya) సినిమా చేస్తున్నారు Megastar చిరు. ఈ సినిమా తర్వాత మెగా లిస్టులో చాలా మంది దర్శకులే ఉన్నారు. ముఖ్యంగా చిరు కోసం రెండు రీమేక్ సినిమా కథలు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి మలయాళ సినిమా ‘Lucifer’ ఒకటి కాగా మరొకటి తమిళ్ ‘వేదాళం’.

ఇందులో లూసిఫర్ రీమేక్ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు చిరు. లాక్ డౌన్ లో యంగ్ డైరెక్టర్ సుజీత్, ఈ రీమేక్ పై వర్క్ చేస్తున్నాడని చెప్పారు. కట్ చేస్తే సుజీత్ ప్లేస్ లో వినాయక్ పేరు ప్రచారంలోకి వచ్చింది. వినాయకే లూసిఫర్ రీమేక్ ను డైరెక్ట్ చేస్తాడని టాక్ ఉంది.

ఇక తాజాగా మెహర్ రమేష్ మెగాస్టార్ తో ‘Vedalam’ రీమేక్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ రీమేక్ తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ రెండు విషయాలపై మెగాస్టార్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

Chiranjeevi పుట్టిన రోజున ఈ రీమేక్స్ పై ఫాన్స్ కి క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఆ రోజున మేకర్స్ ఈ రెండు సినిమాల డీటెయిల్స్ తో ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.