కాటమరాయుడిపై క్లారిటీ ఇచ్చాడు....

Wednesday,September 14,2016 - 05:00 by Z_CLU

కాటమరాయుడు… పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు. సర్దార్ గబ్బర్ సింగ్ అనే చేదు జ్ఞాపకాన్ని మరిచిపోవడానికి వీలైనంత తొందరగా కాటమరాయుడు తెరపైకి రావాలని ప్రతి పవన్ అభిమాని కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే పవన్ కూడా కాస్త వేగంగానే ప్రాజెక్టు ఫైనలైజ్ చేశాడు. అయితే పొలిటికల్ గా మరోసారి బిజీ అయిపోవడంతో కాటమరాయుడు ప్రాజెక్టుపై అనుమానాలు పెరిగిపోయాయి. పవన్ ఇక సినిమాలు చేయడనే ప్రచారం కూడా ఉపందుకుంది. ఎట్టకేలకు ఈ పుకార్లపై పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు.

ఇకపై కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించాడు పవన్. అంతేకాదు… తన నెక్ట్స్ ప్రాజెక్టుకు కాల్షీట్లు కూడా ఎడ్జెస్ట్ చేశాడు. ఈ నెల 24 నుంచి పవన్.. సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ విషయం ఇప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ అయింది. ఈ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాతే మరోసారి పొలిటికల్ గా బిజీ అవ్వాలని పవన్ భావిస్తున్నాడట.