‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్’’ బ్యానర్ లాంచ్

Saturday,August 04,2018 - 05:18 by Z_CLU

సినిమా పరిశ్రమ లో నిలుదొక్కు కోవాలని  డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగుపెట్టి డిస్ట్రిబ్యూషన్పై పరిపూర్ణమైన అవగాహానతో ఇద్దరు కుర్రాళ్ళ ఇండస్ట్రీ లో తమ ప్రయాణం మొదలు పెట్టారు.  ‘‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్’’ పేరుతో ఓ బ్యానర్ స్థాపించారు.. వారే సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండ. వీరిద్దరినీ ప్రోత్సహిస్తూ కొందరు సినీ ప్రముఖులు  ఈ బ్యానర్ లాంఛ్ లో భాగం అయ్యారు.

ఈ బ్యానర్ ని సెన్సేషనల్డైరెక్టర్ ‘మారుతి’ అనౌన్స్ చేయగా, ఈ బ్యానర్ పై తొలి సినిమా చేస్తున్న దర్శకుడు చిన్ని కృష్ణను  ‘‘ఆర్ ఎక్స్ 100’’ హీరో కార్తికేయ , ‘‘ఈ మాయ పేరేమిటో’’ హీరో రాహుల్  విజయ్ లు అనౌన్స్ చేశారు.. సినిమాహాల్ ఎంట్ టైన్మెంట్స్ బ్యానర్ లోగో ని  నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, ‘‘ఆర్స్ ఎక్స్ 100’’ నిర్మాత అశోక్ రెడ్డి, ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. చిన్ని కృష్ణ దర్శకత్వంలో త్వరలో ఈ బ్యానర్ పై  ఓ సినిమా మొదలు కాబోతుంది.