ఆగస్ట్ 19న 'చుట్టాలబ్బాయి' వస్తున్నాడు .

Saturday,August 06,2016 - 11:16 by Z_CLU

 

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా  దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఆగస్ట్‌19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది.  ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ”ఆది, వీరభద్రమ్‌ల కాంబినేషన్‌లో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా’చుట్టాలబ్బాయి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. ఈ సినిమా పాటలకు,థియేట్రికల్ ట్రైలర్ కు  అన్నిచోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ చిత్రాల తర్వాత ఆదికి ‘చుట్టాలబ్బాయి’ మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే ‘అహనా పెళ్ళంట’, ‘పూలరంగడు’ తర్వాత వీరభద్రమ్‌ రూపొందిస్తున్న మరో సూపర్‌హిట్‌ మూవీ ఇది. ఈ చిత్రం సూపర్‌హిట్‌ అయి మా బేనర్స్‌కి కూడా చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు.  లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, బ్రహ్మానందం, పోసాని క ష్ణమురళి, ప థ్వి, రఘుబాబు, క ష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి,షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌.