నాని, అఖిల్ మధ్య క్రిస్మస్ పోటీ

Wednesday,July 26,2017 - 01:03 by Z_CLU

నాని MCA రిలీజ్ డేట్ ఫిక్సయింది. నాని, సాయి పల్లవిగా జంటగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే న్యాచురల్ స్టార్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటిస్తున్న ఈ సినిమాకి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు అఖిల్. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డిసెంబర్ 21 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.

‘నిన్నుకోరి’ సక్సెస్ తరవాత స్పీడ్ పెంచిన నాని, దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా యూనిట్. ‘నేను లోకల్’ తరవాత దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమా ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుండగా, మరోవైపు లాంగ్ బ్రేక్  తరవాత సెట్స్ పైకి వచ్చిన అఖిల్ సినిమా కూడా అంతే క్యూరాసిటీని రేజ్ చేస్తుంది.