చైతన్య-సమంత ల పెళ్ళి డేట్ ఫిక్స్ ?

Friday,November 04,2016 - 12:24 by Z_CLU

అక్కినేని ఇంట్లో వరుసగా పెళ్ళి బాజాలు మొగనున్నాయి. ఇప్పటికే అఖిల్ అక్కినేని , శ్రియ భూపాల్ ఎంగేజ్మెంట్ ను డిసెంబర్ 9న ఫిక్స్ చేసిన నాగార్జున ఫామిలీ చైతన్య-సమంత పెళ్ళి కి డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అఖిల్ పెళ్ళి అవ్వగానే మార్చ్ లో చైతన్య పెళ్ళి కూడా జరగనుందని సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ సినిమా కు సైన్ చేసిన సమంత ఈ లోపు ఆ సినిమాను పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యిందట. మరో వైపు చైతు కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో సినిమాను పూర్తి చేసి పెళ్ళి కి రెడీ అవుతాడట. ఇలా ఈ ఇద్దరు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను ఫిబ్రవరి లోపు పూర్తి చేసి పెళ్లి పీటలెక్కలని ఆలోచిస్తున్నారట. ఏదేమైనా అక్కినేని ఫామిలీ లో యంగ్ హీరో ల పెళ్లిళ్ల తో డిసెంబర్ నుండి మార్చ్ వరకూ పెళ్లి సందడి నెలకొననుంది.