Chittam Maharani టీజర్ టాక్

Saturday,May 21,2022 - 04:00 by Z_CLU

లిటిల్ థాట్స్ సినిమాస్ సమర్పణలు యజుర్వేద్, రచన, సునీల్ కీలక పాత్రల్లో సుకుమార్ శిష్యుడు ఏ. కాశీ తెరకెక్కిస్తున్న సినిమా ‘చిత్తం మహారాణి’. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టీజర్ లాంచ్ చేసి టీంకి బెస్ట్ విషెస్ తెలిపాడు.

 ఎట్రాక్ట్ చేసే సీన్స్ , బ్యూటిఫుల్ విజువల్స్ ,ప్లీసేంట్ మ్యూజిక్ తో 1 నిమిషం 30 సెకన్ల నిడివితో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. పల్లెటూరి ప్రేమకథగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ముఖ్యంగా యజుర్వేద్, రచన పెయిర్ ఈ సినిమాకు చక్కగా కుదిరింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే  ప్రేక్షకుల ముందుకు రానుంది.  గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. సురేష్ సిద్హాని మాటలు రాస్తున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics