రంగస్థలం, చిత్రలహరి మధ్య లింక్ ఏంటి ?

Tuesday,March 12,2019 - 04:10 by Z_CLU

లాజికల్ గా చూస్తే ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్నాయంతే. అంతకుమించి ఎలాంటి లింక్ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా మరో లింక్ జనరేట్ అయింది. పూర్తిగా రంగస్థలం తరహాలో, చిత్రలహరికి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయింది.

‘రంగస్థలం’ 10 రోజుల్లో రిలీజ్ అనగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసారు మేకర్స్.. రంగస్థలం అనే ఊరు… అందులో పాత్రల పేర్లు.. ఆ పాత్రలు ఎవరు చేస్తున్నారు.. వారి గెటప్స్ సినిమాలో ఎలా ఉండబోతున్నాయనే విషయాలతో…ఓ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ చేశారు. అప్పట్లో ఆ టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. అందుకే ఇప్పుడు చిత్రలహరికి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు.

‘చిత్రలహరి’లోని పాత్రలను పరిచయం చేస్తూ రేపు ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ ద్వారా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శి , నివేత పేతురాజ్, సునీల్, వెన్నెల కిషోర్ పాత్రలు ఏంటనేది రేపు తెలుస్తుంది.

‘రంగస్థలంలో’ పాత్రల ఫొటోస్ తో టీజర్ వదిలితే…. ఇప్పుడు ‘చిత్రలహరి’లో  పాత్రలకు సంబంధించిన సన్నివేశాలతో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, ఏప్రిల్ 12న థియేటర్లలోకి రానుంది.