చిత్రలహరి ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,April 19,2019 - 04:14 by Z_CLU

సాయి తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమా సేఫ్ జోన్ లో పడింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసి, ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఇప్పటివరకు 10 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న సాయితేజ్ కు ఎట్టకేలకు చిత్రలహరి రూపంలో హిట్ వచ్చింది. కేవలం సాయితేజ్ కు మాత్రమే కాదు, హిట్ లేక ఇబ్బంది పడుతున్న కల్యాణి ప్రియదర్శన్, నివేత పెతురాజ్ కూడా ఈ సినిమాతో ఊపిరి పీల్చుకున్నారు. అటు దర్శకుడు కిషోర్ తిరుమల కూడా మళ్లీ సక్సెస్ బాట పట్టాడు.

ఏపీ,నైజాం ఫస్ట్ వీక్ షేర్స్

నైజాం – రూ. 3.22 కోట్లు

సీడెడ్ – రూ. 1.70 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.50 కోట్లు

ఈస్ట్ – రూ. 0.92 కోట్లు

వెస్ట్ – రూ. 0.67 కోట్లు

గుంటూరు – రూ. 0.84 కోట్లు

కృష్ణా – రూ. 0.72 కోట్లు

నెల్లూరు – రూ. 0.34 కోట్లు