చిరు డైలాగ్స్ షురూ

Monday,October 03,2016 - 05:14 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రీఎంట్రీ ఇస్తున్నచిత్రం `ఖైదీ నెం 150`. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మాణం లో వీవీ వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది.

మెగా స్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి 70 శాతం చిత్రీకరణ పూర్తయింది.

14039938_1056937607735012_5367635492049514171_n-1

ఈ సందర్బంగా నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -“70 శాతం పైగా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తాజా గా నాన్న‌ డ‌బ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్ప‌టివ‌ర‌కూ చ‌క్క‌ని ఔట్‌పుట్ వ‌చ్చింద‌న్న సంతృప్తి మా యూనిట్ అందరిలోనూ ఉంది. అన్ని ప‌నులు పూర్తి చేసి, జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.