ఖైదీ నంబర్-150 సినిమాలో హైలెట్స్

Wednesday,November 23,2016 - 09:35 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి దాదాపు 9ఏళ్ల తర్వాత హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఖైదీ నంబర్ 150’. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కానుంది.
chiranjeevi-kajal-agarwal-khaidi-no-150-first-look
తమిళ చిత్రం ‘కత్తి’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులకూ పండగే నట. రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాను తనదైన స్టైల్ లో టాలీవుడ్  ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కిస్తున్నాడట వినాయక్.  తాజాగా యూరప్ లో  చిత్రీకరిస్తున్న పాటలతో పాటు ఐటెంసాంగ్ లో మెగాస్టార్ స్టెప్స్ అభిమానులకు  ఫీస్ట్ అంటున్నారు చిత్ర యూనిట్. ఈ పాటలతో పాటు రైతులతో మెగా స్టార్ సన్నివేశాలు. కోర్టు సన్నివేశం సినిమాకు హైలైట్స్ అనే టాక్ వినిపిస్తుంది.