#Chiru154 - మెగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ !

Thursday,July 01,2021 - 07:37 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తవ్వగానే లూసిఫర్ రీమేక్ ను మొదలు పెట్టనున్నారు చిరు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో పాటు #CHIRU154 పై కూడా ఫోకస్ పెడుతున్నారు మెగా స్టార్. బాబీ దర్శకత్వంలో #CHIRU154 సినిమా చేయనున్న చిరు ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

chiranjeevi lucifer remake titled as king maker zeecinemalu

తాజాగా ఇందులో విలన్ రోల్ కి బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్దిక్ ను సంప్రదించారట. ఇటివలే ఫోన్ ద్వారా నవాజుద్దిన్ కి క్యారెక్టర్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్పాడట బాబీ. త్వరలోనే ముంబై వెళ్లి ఫైనల్ నెరేషన్ ఇవ్వాల్సి ఉందట. అది పూర్తయితే మెగా స్టార్ నటించబోయే సినిమాలో నవాజుద్దిన్ కనిపిస్తాడు. అలాగే హీరోయిన్ మిగతా నటీ నటుల సెలెక్షన్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.

స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ఈ లోపు మెగా స్టార్ లూసిఫర్ రీమేక్ సినిమాను ఫినిష్ చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఈ భారీ సినిమా తెరకెక్కనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు మేకర్స్. త్వరలోనే సినిమా హీరోయిన్ , మ్యూజిక్ డైరెక్టర్ మిగతా టెక్నీషియన్స్ వివరాలు తెలియనున్నాయి

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics