సైరా నరసింహారెడ్డి.. చిరంజీవి 151వ సినిమా

Tuesday,August 22,2017 - 12:49 by Z_CLU

చిరంజీవి 151వ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ సినిమాకు సైరా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ కింద నరసింహారెడ్డి అనే పేరు కూడా పెట్టారు. టోటల్ గా చిరంజీవి 151వ చిత్రం పేరు సైరా నరసింహారెడ్డి.

చిరు పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు నటీనటుల వివరాల్ని కూడా వెల్లడించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడు. మోషన్ పోస్టర్ కు మాత్రం తమన్ సంగీతం అందించాడు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్న విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. మరో రెండు కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు కూడా కనిపించనున్నారు. స్వతంత్ర ఉద్యమం నేపథ్యంలో సినిమా ఉంటుందని, పొడవాటి జుట్టుతో సరికొత్త మేకోవర్ లో చిరంజీవి కనిపించబోతున్నాడనే విషయం మోషన్ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది.