ప్రేమమ్ బాటలో...

Tuesday,October 11,2016 - 11:12 by Z_CLU

గతంలో తడాఖాలాంటి రీమేక్ తో హిట్ కొట్టిన నాగచైతన్య మరోసారి ప్రేమమ్ రీమేక్ తో సక్సెస్ అందుకున్నాడు. రీమేక్స్ తనకు బాగానే కలిసొస్తాయని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ప్రేమమ్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు మరింత మంది హీరోలు తమ రీమేక్ లు కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉన్న హీరో చిరంజీవి.
chiru-150
తమిళ్ లో గ్రాండ్ హిట్  గా నిలిచి భారీ వసూళ్లు రాబట్టిన ‘కత్తి’ సినిమాను తెలుగులో ‘ఖైదీ నెం 150’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు చిరు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. మరి ఈ రీమేక్ తో రీ-ఎంట్రీ   ఇస్తున్న మెగా స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటాడా? చూడాలి.
dhruva-overseas-rights
రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ధృవ’ సినిమా కూడా రీమేకే. ఈ సినిమాతో తొలిసారి గా రీమేక్ రాజా అవతారం ఎత్తబోతున్నాడు చెర్రీ. తమిళ్ లో గ్రాండ్ హిట్ సాధించిన ‘తనీ ఒరువన్’ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్.

3232_guru
రీమేక్ రాజా బిరుదుకు పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడు వెంకీ. ఇప్పటికే పలు రీమేక్స్ తో హిట్స్ అందుకున్న విక్టరీ వెంకటేశ్…  ఇటీవలే బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచి మంచి ఆదరణ పొందిన ‘సాలా ఖదూస్’ చిత్రాన్ని ‘గురు’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. ఇక ఈ లిస్ట్ లో హఠాత్తుగా వచ్చి చేరాడు సుమంత్. కథానాయకుడిగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అక్కినేని హీరో త్వరలోనే విక్కీ డోనర్ రీమేక్ తో నరుడా డోనరుడా అనే సినిమాతో మనముందుకొస్తున్నాడు.