నక్సల్స్ వస్తున్నారు

Saturday,March 20,2021 - 11:19 by Z_CLU

త్వరలోనే మెగా స్టార్ చిరు, దగ్గుబాటి రానా సేమ్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  అవును ‘ఆచార్య’ సినిమాలో చిరు , ‘విరాటపర్వం’ సినిమాలో రానా నక్సలైట్ గా కనిపించబోతున్నారు. ‘విరాటపర్వం’లో రానా నక్సలైట్ గా కనిపించనున్నట్లు ముందు నుండి  చెప్తూ వస్తున్నారు యూనిట్. ఇక ‘ఆచార్య’ లో చిరు కూడా అదే పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆ విషయంపై మెగా స్టారే క్లారిటీ ఇచ్చారు.

‘విరాటపర్వం’ టీజర్ ని చిరుతో లాంచ్ చేయించారు రానా అండ్ టీం. ఆ సందర్భంలో చిరంజీవి నేను కూడా ‘ఆచార్య’ లో నక్సలైట్ గా నటిస్తున్నా అంటూ రానాతో అన్నారు. అయితే పాత్రల పరంగా చిరు , రానా సినిమాలు మ్యాచ్ అయినా కథ , కథనం , పాత్రల తీరు అన్ని వేరుగా ఉంటాయి. కాకపోతే నక్సలైట్ అనే ఎలిమెంట్ మాత్రం రెండిటిలో సేం టు సేమ్. మరి మెగా స్టార్ , రానాలు ఈ పాత్రలలో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.