ఉయ్యాలవాడ కోసం చిరు మేకోవర్

Tuesday,May 02,2017 - 12:45 by Z_CLU

తన 151 వ సినిమా కోసం మేకోవర్ స్టార్ట్ చేశారు చిరంజీవి. హిస్టారికల్ కంటెంట్ తో తెరకెక్కనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా కోసం గడ్డం పెంచారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రిన్సిపల్ ఫొటోషూట్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపించబోతున్నారు చిరు.

రీసెంట్ గా ఈ క్యారెక్టర్ కోసం భారీగా రీసర్చ్ జరిపిన సురేందర్ రెడ్డి టీమ్ స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తిచేసింది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇంకా హీరోయిన్ డిసైడ్ అవ్వాల్సి ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి గడ్డంతో పాటు డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో కనిపిస్తారట. చిరంజీవి గెటప్ కు తలపాగా పెట్టాలాా వద్దా అనే ఆలోచనలో యూనిట్ ఉంది.

మరోవైపు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే సెట్స్ నిర్మాణం ప్రారంభమైంది. 1840 కాలంనాటి రాయలసీమ గ్రామాన్ని తలపించే విధంగా సెట్ ను రూపొందించే పని ప్రారంభమైంది. సినిమా లాంచింగ్ ఎప్పుడునే విషయంపై యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.