ఆ దర్శకుడితో చిరు ఫిక్స్....

Saturday,January 21,2017 - 03:17 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు గొడుతున్న మెగా స్టార్ చిరంజీవి ఇదే జోష్ తో తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టాడు. రి ఎంట్రీ కి అందుకున్న గ్రాండ్ వెల్కమ్ చిరు లో సరి కొత్త జోష్ నింపిందట. అందుకే మొన్నటి వరకూ తన 151 సినిమాను కాస్త గ్యాప్ తీసుకొని సెట్స్ పై తీసుకురావాలనుకున్న మెగా స్టార్ ప్రెజెంట్ ఆ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

ఇక మొన్నటి వరకూ తన 151 సినిమాకు కొందరు దర్శకుల పేర్లు పరిశీలించి కథలు విన్న చిరు ఫైనల్ గా ఇటీవలే రామ్ చరణ్ కి ‘ధృవ’ వంటి గ్రాండ్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి కే ఓటేసాడట. ఇటీవలే సురేందర్ రెడ్డి చెప్పిన కథ చిరు కి బాగా నచ్చడం తో ఈ కథ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందని టాక్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్న ఈ సినిమా మార్చ్ లో పూజ కార్యక్రమాలతో స్టార్ట్ అవ్వనుందని సమాచారం.