ఆ రోజే 151 పై క్లారిటీ...

Wednesday,January 25,2017 - 08:16 by Z_CLU

ఖైదీ నంబర్ 150 తో రి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ తన సత్తా చాటిన మెగా స్టార్ తన 151 సినిమాపై ఫోకస్ పెట్టాడు. రి ఎంట్రీ కి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో జెట్ స్పీడ్ తో మరో సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడట మెగా స్టార్. ఇప్పటికే తన 151 సినిమాకు సంబంధించి డైరెక్టర్ ని ఫైనల్ చేసేసిన చిరు ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ‘ఖైదీ నంబర్ 150’ థాంక్స్ మీట్ లో ఇవ్వబోతున్నాడట.

ప్రెజెంట్ 151 సినిమా గురించి వినిపిస్తున్న వార్తలకు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో క్లారిటీ ఇవ్వబోతున్నాడట చిరు. ఇక ‘ఖైదీ నంబర్ 150’ థాంక్స్ మీట్ ను జనవరి 28 న నిర్వహించాలని డిసైడ్ అయిన యూనిట్ అతి త్వరలోనే ఆ డేట్ తో పాటు ప్లేస్ ను కూడా తెలియజేయడానికి రెడీ అవుతున్నారట. మెగా ఫాన్స్ భారీ గా హాజరయ్యే ఈ ఈవెంట్ లో తన 151 సినిమా డైరెక్టర్ ను, మిగతా వివరాలను ను తెలియజేసి అభిమానులను మరింత ఖుషి చేయబోతున్నాడట చిరు.