సైరా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Wednesday,December 06,2017 - 12:12 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూట్ మొదలైంది. తొలిరోజు సెట్స్ లో యూనిట్ సభ్యులంతా ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు. సెల్ఫీలతో సందడి చేశారు.

https://twitter.com/KonidelaPro/status/938280353961332736

దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతోంది సైరా నరసింహారెడ్డి. చిరంజీవి కెరీర్ లోనే కాకుండా, టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది సైరా.

సైరాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు. జై సింహా షూట్ కంప్లీట్ అయిన తర్వాత సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.