మార్చి 5 నుంచి సైరా షూటింగ్

Thursday,March 01,2018 - 12:35 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకెండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందా అనిఅంతా వెయిటింగ్. అయితే సెకెండ్ షెడ్యూల్ కంటే ముందు మరో 3 రోజులు షూట్ ప్లాన్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ లో పెండింగ్ లో ఉన్న ఓ ఫైట్ సీక్వెన్స్ ను ఈ 3 రోజుల్లో పూర్తిచేయబోతున్నారు. ఈనెల 5 నుంచి ఇది మొదలవుతుంది.

మార్చి 5 నుంచి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సైరా ఫస్ట్ షెడ్యూల్ కొనసాగుతుంది. 7వ తేదీతో ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత సెకెండ్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెర్రీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

సైరా నరసింహారెడ్డి సినిమా కోసం దాదాపు 2వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ సెట్టింగ్స్ నిర్మించారు. టెక్నీషియన్స్ తో పాటు ఇతర నటీనటుల కాల్షీట్లు ఎడ్జెస్ట్ అయిన వెంటనే సైరా సెకెండ్ షెడ్యూల్ షురూ అవుతుంది.