రోజురోజుకు పెరుగుతున్న సైరా హీరోయిన్ల లిస్ట్

Tuesday,June 26,2018 - 11:24 by Z_CLU

మొన్నటివరకు మెగాస్టార్ సినిమాకు హీరోయిన్ దొరకడం కష్టంగా మారింది. అలాంటిది ఇప్పుడు సైరా సినిమాకు వరుసపెట్టి హీరోయిన్లను లాక్ చేస్తోంది యూనిట్. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేసిన యూనిట్.. చిరు-నయన్ కాంబోలో ఓ భారీ షెడ్యూల్ కూడా పూర్తిచేసింది.

ఆ షెడ్యూల్ జరుగుతున్న టైమ్ లోనే ఓ కీలక పాత్ర కోసం తమన్నను తీసుకున్నారు. అదే టైమ్ లో మరో ప్రత్యేక పాత్ర కోసం ప్రగ్యా జైశ్వాల్ ను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా హుమా ఖురేషి కూడా చేరిందట. రీసెంట్ గా రజనీకాంత్ సరసన కాలా సినిమాలో నటించిన హుమా, ఇప్పుడు సైరా ప్రాజెక్టుకు సై అన్నట్టు టాక్.

హీరోయిన్లే కాదు, ఈ సినిమాలో హీరోలు కూడా ఎక్కువే. మెగాస్టార్ మెయిన్ హీరో. అతడ్ని పక్కనపెడితే బిగ్ బి అమితాబ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ సుదీప్ లాంటి ఎంతోమంది నటులు సైరాలో చేరారు. మెగాస్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది సైరా.