సైరా సెకెండ్ షెడ్యూల్ లో మార్పు

Thursday,February 22,2018 - 01:47 by Z_CLU

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తోంది సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో చిన్న మార్పు చోటుచేసుకుంది. లెక్కప్రకారం రేపట్నుంచి ప్రారంభం కావాల్సిన సెకెండ్ షెడ్యూల్ ను మార్చి రెండో వారానికి పోస్ట్ పోన్ చేశారు.

సైరా సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న రత్నవేలు.. రామ్ చరణ్-సుకుమార్ సినిమా రంగస్థలంకు కూడా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. రంగస్థలం సినిమా వర్క్ ఇంకా పెండింగ్ ఉండడంతో, సైరా సెట్స్ పైకి రావడానికి రత్నవేలుకు టైం దొరకలేదు. దీంతో సైరా షెడ్యూల్ ను వాయిదావేశారు.

ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. సెకండ్ షెడ్యూల్ లో మాత్రం చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ నయనతార సెట్స్ పైకి రాబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న ఈ 151వ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.